'ఇది బాబు బ్రాండ్ స్వరం'

హైదరాబాద్: చంద్రబాబు అధికారంలోకి వస్తే ఛార్జీల బాదుడే అని మరోసారి రుజువైందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ ఛార్జీల పెంపును చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట..అధికారంలోకి వచ్చిన త ర్వాత మరోమాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే వైఎస్‌ఆర్‌సీపీ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వాసిరెడ్డి పద్మ చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Back to Top