వర్షంలోనూ కొనసాగుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ దీక్షహైదరాబాద్, 02 ఏప్రిల్ 2013: భారీ వర్షంలోనూ శ్రీమతి వైయస్ విజయమ్మ నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తడుస్తూనే దీక్ష చేస్తున్నారు. విద్యుత్తు
చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ నేతృత్వంలో వారు మంగళవారం ఉదయం నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.  జంటనగరాలలో మధ్యాహ్నం భారీ వర్షం పడింది. దీక్షాప్రాంగణం ఆదర్శ్‌నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ను కూడా వర్షం ముంచెత్తింది. గాలి
దుమారంతో దీక్షా ప్రాంగణంలో వేసిన టెంట్లు కూలిపోయాయి. అయినా నేతలు వెరవక దీక్షను కొనసాగిస్తున్నారు.
Back to Top