దళితులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి

ఆగిరిపల్లిలో దళితులపై జరిగిన కక్ష సాధింపు చర్యలను ఇప్పటికైనా టీడీపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఏలూరు ఎంపీ మాగంటి బాబు మానుకోవాలని తిరుపతి ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో వేధించబడిన స్థానిక దళితుల్ని ఎంపీ వరప్రసాద్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా వేధించబడిన దళితులు తమపై అక్రమంగా నమోదైన అక్రమ కేసుల గురించి ఎంపీకి వివరించారు. అనంతరం ఎంపీ వరప్రసాద్‌ మాట్లాడుతూ... దళితులపై నానాటికి పెరుగుతున్న దాడులను అరికట్టాలంటే మరిన్ని చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆగిరిపల్లి, గరగపర్రు, దేవరపల్లిలో దళితులపై జరిగిన దాడులు టీడీపీ దళిత వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని దుయ్యబట్టారు. దళితలుపై జరుగుతున్న అకృత్యాలను వైయస్సార్‌ సీపీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళతామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికైనా దళితులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఎంపీని కలిసిన వారిలో పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు.

Back to Top