వీధి కుక్కలా ప్రవర్తిస్తున్న వరదరాజులురెడ్డి

ప్రొద్దుటూరు: చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో టీడీపీ నేతలు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్‌ కార్యాలయం ముందు వైయస్‌ఆర్‌ సీపీ కౌన్సిలర్లు, చైర్మన్‌ అభ్యర్థి ముక్తియార్‌తో కలిసి రాచమల్లు మీడియాతో మాట్లాడారు. 45 సంవత్సరాల వయస్సులో ఉన్న మేము శాంతికాముకులుగా ఉంటే కాటికి కాళ్లుజాపి 72 సంవత్సరాల వయస్సులో ఉన్న టీడీపీ నేత వరదరాజులు రెడ్డి బజారు కుక్కలా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. 2014 ఎన్నికల్లో 18 మంది కౌన్సిలర్‌లు వైయస్‌ఆర్‌ సీపీ తరుపున గెలిచారని చెప్పారు. వారిలో ముక్తియార్‌తో కలిసి 9 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారన్నారు. అప్పుడు ఒక్కమాటైనా మాట్లాడామా అని టీడీపీని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 మంది వైయస్‌ఆర్‌ సీపీ ప్రజాప్రతినిధులను టీడీపీ దౌర్జన్యంగా కొనుగోలు చేసినా ఎలాంటి అలజడులు సృషించలేదని చెప్పారు. సంస్కారం, సాంప్రదాయం వైయస్‌ఆర్‌ సీపీకే ఉంది కానీ.. టీడీపీకి లేదన్నారు. సంస్కారహీనమైన పార్టీగా తెలుగుదేశం అవతరిస్తోందని ఎద్దేవా చేశారు. చైర్మన్‌ ఎన్నిక జరిగే వరకు మున్సిపల్‌ కార్యాలయంలోనే ఉంటామని స్పష్టం చేశారు. టీడీపీ నేతల నుంచి తమకు హాని వుందని, పోలీస్‌ ఉన్నతాధికారులు భద్రత కల్పించాలని కోరినట్లుగా చెప్పారు.

Back to Top