తల్లి, పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు

ఏపీ అసెంబ్లీ: సకాలంలో వైద్యం అందక, పౌష్టికాహార లోపంతో తల్లి, పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మతాశిశు మరణాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. నా నియోజకవర్గంలోని ఐటీడీఏ పరిధిలో 18 పీహెచ్‌సీలు ఉన్నాయి . రాజవొమ్మంగి మండలంలో 25 మాతాశిశుమరణాలు జరిగాయి. తల్లి, పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు. వాళ్లకి ఒక అంబులెన్స్‌ కూడా పంపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతన్నా  మంత్రులు, అధికారులు ఇక్కడికి రాలేదని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మా ప్రాంతానికి వచ్చి బాధితులకు భరోసా కల్పించాలి. మాతాశిశు మరణాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు.

Back to Top