మోహనరంగా వర్థంతి..ఘన నివాళి

విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా 27వ వర్థంతి వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. మోహన రంగా ప్రజా నాయకుడని ఆయన తనయుడు వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ అన్నారు. వంగవీటి మోహన రంగా 27వ వర్థంతి సందర్భంగా ... నగరంలోని రాఘవయ్య పార్క్ సెంటర్లో ఆయన విగ్రహానికి రాధాకృష్ణ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం రాధాకృష్ణ మాట్లాడుతూ... రంగాపై విమర్శలు చేసే అర్హత ఎవరికీ లేదని ఆయన తెలిపారు. తన తండ్రి రంగాపై అసంబద్ధమైన విమర్శలు ఎవరు చేసినా సహించమని హెచ్చరించారు.  రాధా - రంగా మిత్ర మండలి ఆధ్వర్యంలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా రాధాకృష్ణ ప్రారంభించారు.

Back to Top