ప్రజల పక్షాన నిలబడిన ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌


చిత్తూరు:  ప్రజల పక్షాన నిలబడిన ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైయస్‌ఆర్‌సీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉషా అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా  సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉషా మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు మొదటి నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. జనం వేలాదిగా తరలివచ్చి పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి వైయస్‌ జగన్‌కు తమ సమస్యలు చెప్పుకుంటున్నారని చెప్పారు.  దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రజలకు మేలు జరిగిందని, మళ్లీ అలాంటి పాలన కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. నాలుగేళ్లలో టీడీపీ పరిపాలనలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.  ప్రజల పక్షాన ఉంటూ అనేక పోరాటాలు చేస్తూ, ప్రజా ఉద్యమ పార్టీగా తీర్చి దిద్దుతూ వైయస్‌ జగన్‌ చేస్తున్న పోరాటాలు చేస్తున్నారన్నారు. పాదయాత్ర ద్వారా పల్లెకు గడప గడపకు వెళ్తున్నారని, ప్రజలందరూ వైయస్‌ జగన్‌కు ఎదురు చూస్తూ...పూలవర్షం కురిపిస్తున్నారని చెప్పారు. వైయస్‌ జగన్‌కు అండగా ఆయన వెంబడే పయనిస్తున్నామన్నారు.
 
Back to Top