సింహపురి గడ్డపై వంచన పై గర్జన విజయవంతం

ప్రజలను వంచించిన
పార్టీలకు గుణపాఠం తప్పదు

 నెల్లూరు : నాలుగేళ్లలో
ప్రజలను వంచిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ
వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం  నెల్లూరు విఆర్ కాలేజి కళాశాలలో నిర్వహించిన వంచన
పై గర్జన దీక్ష విజయవంతంగా ముగిసింది. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు,
కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి నిరసన వ్యక్తం చేసారు. విభజన హామీల అమలు,
ప్రత్యేక హోదా వర్తింప చేయకపోవడాన్ని గర్హిస్తూ ప్రజలను మోసం చేసారంటూ తీవ్రంగా
మండిపడ్డారు.  పార్టీ ఎంపీలు,
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు అనేక మంది సీనియర్ నాయకులు ఈ సమావేశంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని
ఎండగట్టారు. 2019 లో టిడిపికి
తగిన బుద్ధి చెప్పాలని ఈసందర్భంగా మాట్లాడిన నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రానికి ప్రథమ శత్రువు చంద్రబాబు నాయుడే అని పేర్కొన్నారు. నవనిర్మాణ దీక్షల
పేరుతో చంద్రబాబు నాయుడు ప్రజలను మళ్లీ మళ్లీ వంచిస్తున్నారని, తన చేతకాని తనాన్ని
కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆగ్రహం
వ్యక్తం చేశారు.  

ఉదయం తొమ్మిది
గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష సాయంత్రం అయిదు గంటలకు ముగిసింది. మధ్యాహ్నం ప్రాంతంలో
భారీ గాలులతో వర్షం పడింది, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయినా నాయకులు, కార్యకర్తలు ఏమాత్రం చలించకుండా సభా
ప్రాంగణంలోనే ఉంటూ నిరసన వ్యక్తం చేశారు. పలువురు, నాయకులు వర్షంలో తడిసి ముద్దైనా
నిర్దేశిత సమయం వరకు అక్కడే ఉండి ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. 
Back to Top