ముగిసిన వంచన పై గర్జన దీక్ష

ప్రత్యేక హోదా, విభజన హామీల
విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న చేస్తున్న మోసాన్ని, దగాను
నిరసిస్తూ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురంలో నిర్వహించిన వంచన పై గర్జన దీక్ష
విజయవంతమైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ దీక్షలో పాల్గొన్న నేతలంతా టిడిపి,
బిజెపి చేస్తున్న మోసాలను ఎండగట్టారు. అవకాశ వాద రాజకీయాలను నిరసిస్తూ, స్వార్థం
కోసం ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు.

పెద్ద ఎత్తున యువత,
విద్యార్ధులు, అనంతపురం పరిసరల్లాలోని అనేక మంది తరలి వచ్చి  దీక్షను విజయవంతం చేశారు. ప్రత్యేక హోదా కోసం
పదవులను త్యాగం చేసిన ఎంపిలతో పాటు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులనేక
మంది పాల్గొన్నారు. పార్టీ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్ధులు
భారీ ఊరేగింపు నిర్వహించి దీక్షా స్థలికి చేరుకున్నారు.

ప్రత్యేక హోదా, తదితర అంశాలపై గత నాలుగేళ్లుగా నిరంతరం
పోరాటాలు చేస్తున్న వైయస్ ఆర్ కాంగ్రెస్ , ప్రతి జిల్లాలోనూ వంచన పై గర్జన
దీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇంతవరకు విశాఖ, నెల్లూరులో
ఇటువంటి దీక్షలను నిర్వహించగా మూడో వేదికగా అనంతపురంలో దీక్షను
నిర్వహించారు.  

Back to Top