వంచనపై గర్జన దీక్ష

 
- కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల తీరుకు నిర‌స‌న‌గా వైయ‌స్ఆర్‌సీపీ మ‌రో ఉద్య‌మం
- గుంటూరుకు త‌ర‌లివ‌చ్చిన పార్టీ నేత‌లు, ప్ర‌జ‌లు 
గుంటూరు: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేసిన అన్యాయాన్ని నిర‌సిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ మ‌రో పోరాటానికి శ్రీ‌కారం చుట్టింది. గుంటూరు వేదిక‌గా వైయ‌స్ఆర్ సీపీ ఆధ్వ‌ర్యంలో వంచ‌న‌పై గ‌ర్జ‌న దీక్ష‌ను చేప‌ట్టారు. హోదా పదేళ్లు ఇస్తామని మోదీ, కాదు 15 ఏళ్లు కావాలని చంద్రబాబు తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రగల్భాలు పలికారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తామంటూ నమ్మబలికి ఓట్లు దండుకుని గద్దెనెక్కారు. అప్పటి నుంచి హోదాను పక్కకు నెట్టారు. హోదా కోసం వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఊరూరా గళం విప్పారు. ఈ ఉద్యమాన్ని పాలకులు అధికారంతో అణగదొక్కే ప్రయత్నం చేశారు. చివరకు కమీషన్ల కోసం సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి తలూపి హోదాను తాకట్టు పెట్టారు. ప్రజలు భగ్గుమనడంతో చంద్రబాబు మళ్లీ హోదా అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. మరోసారి రాష్ట్రాన్ని వంచించేందుకు నడుం బిగించారు. దీనిపై ప్రజలను చైతన్యం చేసేందుకు గురువారం గుంటూరు వేదికగా వంచనపై గర్జన పేరుతో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు దీక్ష బూనారు.  

నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైయ‌స్ఆర్‌సీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. ఇప్పటికే వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా యువభేరిలు, నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, రిలే దీక్షలు, వంటా వార్పులు ఇలా అనేక రకాల ఉద్యమాలతో పోరాటం సాగించారు. ఈ క్రమంలో గుంటూరు వేదికగా వంచనపై గర్జన పేరుతో రాష్ట్ర స్థాయి దీక్ష చేపట్టారు. నగరంలోని ఇన్నర్‌రింగ్‌ రోడ్డులోని వీఏఆర్‌ గార్డెన్స్‌లో ఉదయం 9 నుంచి దీక్ష ప్రారంభ‌మైంది. దీక్ష‌కు వేలాది మంది ప్ర‌జ‌లు హాజ‌రై చంద్ర‌బాబు ప్ర‌భుత్వ దురాగాతాల‌ను ఎండ‌గడుతున్నారు. 


Back to Top