వంచనపై గర్జన- నల్లబ్యాడ్జితో వైయస్ జగన్ పాదయాత్ర

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి
చేసిన దారుణమైన మోసం, అన్యాయంపై కొనసాగిస్తున్న పోరును వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ
మరింత తీవ్రతరం చేసింది. నవనిర్మాణ దీక్షల పేరుతో చంద్రబాబు, ప్రజలను వంచిస్తున్న
తీరుపై శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ప్రత్యేక హోదాతో పాటు,
విభజన చట్టంలోని హామీలను సాధించడంలో చంద్రబాబు విఫలం కావడం, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన
హామీని అమలు చేయని కేంద్రంలోని బిజెపి నేతృత్వ ఎన్డీఏ సర్కారుపై సమర శంఖాన్ని
పూరించింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులందరూ నల్లబ్యాడ్జీలతో నిరసన
తెలిపుతున్నారు. ప్రజా సంకల్పయాత్రలో ఉన్న పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్
రెడ్డి చేతికి నల్ల రిబ్బను ధరించి నిరసన వ్యక్తం చేస్తూ పాదయాత్ర
కొనసాగిస్తున్నారు.

 నెల్లూరు లో విఆర్ కళాశాల మైదానంలో వంచన పై గర్జన
దీక్షను చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ దీక్షలో పార్టీకి చెందిన
సీనియర్ నాయకులంతా పాల్గొంటున్నారు. పదవులకు రాజీనామాలు చేసిన ఐదుగురు లోక్‌సభ
సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ ప్రాంతీయ కోఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
నల్లదుస్తులు ధరించి.. కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాల తీరును ఎండగడుతూ.. నేతలు దీక్షలో కూర్చున్నారు.

Back to Top