వంచన పై గర్జనతో హోరెత్తుతున్న కలెక్టరేట్లు

ప్రత్యేక హోదా విషయంలోనూ, ఎన్నికలకు ముందు
ప్రజలకు ఇచ్చిన హామీల అమలులోనూ చంద్రబాబు చేస్తున్న మోసాన్ని గర్హిస్తూ వైయస్ఆర్
కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కలెక్టరేట్ల ముందు వంచన పై  గర్జన నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రతిజిల్లా
కలెక్టరేట్ల ముందు వైయస్ ఆర్ కాంగ్రెస్ శ్రేణుల నిరసనల హోరుతో మార్మోగుతున్నాయి. నియోజకవర్గాల
నుంచి ర్యాలీలుగా బయలుదేరి, కలెక్టరేట్ల వద్ద ప్రదర్శన చేస్తున్నారు. ఈ సందర్భంగా
ప్రత్యేక హోదా ఆంధ్రులహక్కు అని ఎలుగెత్తి చాటుతున్నారు. ఈ హాదా విషయంలో చంద్రబాబు
చేసిన మోసాన్ని, ప్రజలను వంచించిన వైనాన్ని తీవ్రంగా ఎండగడుతున్నారు. రాజీనామా లు
చేసిన పార్లమెంటుసభ్యులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు , నియోజకవర్గాల సమన్వయ
కర్తలు పెద్ద ఎత్తున కలెక్టర్ల వద్దకు చేరుకుని నిరసన కొనసాగిస్తున్నారు. 

ఎన్నికలకు ముందు వందల సంఖ్యలో ఇచ్చిన హామీలను అమలు
చేయకుండా, నాలుగేళ్లుగా ప్రజలను వంచిస్తూ ఇంకా ప్రజలను భ్రమల్లో పెడుతున్నారని ఈ
సందర్భంగా ప్రసంగిస్తున్న నాయకులు ధ్వజమెత్తుతున్నారు. వంచనను
నిలదీస్తున్నారు.  

Back to Top