గర్జనకు సిద్ధమవుతున్న అనంత


ఏర్పాట్లు పూర్తి చేసిన నాయకులు, కార్యకర్తలు
కేంద్ర, రాష్ట్ర నియంత వైఖరిపై వైయస్‌ఆర్‌ సీపీ పోరు

అనంతపురం: కేంద్ర, రాష్ట్ర నియంత వైఖరికి నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరు ఉధృతం చేసింది. విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా సాధనకు అనంత వేదికగా ‘వంచనపై గర్జన దీక్ష’ చేపట్టింది. అందుకు అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల మైదానం ముస్తాబైంది. వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న గర్జన దీక్షలో మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. వంచనపై గర్జన పేరుతో ఇప్పటికే వైయస్‌ఆర్‌ సీపీ విశాఖ, నెల్లూరు జిల్లాలో నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగనున్న దీక్షలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రాన్ని మోసం చేసిందో.. రాష్ట్ర ప్రభుత్వం తన స్వార్థ ప్రయోజనాల కోసం వనరులను ఏ విధంగా తాకట్టుపెట్టిందో వివరించనున్నారు. ఈ మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ప్రత్యేక హోదా సాధించుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల వారిగా వంచనపై గర్జన కార్యక్రమాన్ని తలపెట్టారు.
Back to Top