రేపు అనంతలో వంచనపై గర్జన దీక్ష

అనంతపురం : ప్రత్యేక హోదా
విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మోసాన్ని నిరసిస్తూ అనంతపురం లో సోమవారం
నాడు వైయస్ ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వంచన పై గర్జన దీక్షను నిర్వహిస్తున్నారు.
ప్రత్యేక హోదా సాధన కోసం అలుపురెగని పోరాటం చేస్తూ, పార్టీకి చెందిన లోకసభ సభ్యుల
చేత రాజీనామాలు కూడా చేయించిన వైయస్ ఆర్ సీపీ, జిల్లాల వారీగా వంచన పై గర్జన
దీక్షలను నిర్వహిస్తోంది, ఇందులో భాగంగా ఇప్పటికే విశాఖ, నెల్లూరు జిల్లాలో ఈ
దీక్షలు జరగ్గా జూలై 2 వ తేదీన అనంతపురం ఆర్ట్ కళాశాల మైదానంలో తదుపరి దీక్షను
నిర్వహిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ దీక్షలోపార్టీకి చెందిన ముఖ్య
నాయకులందరూ పాల్గొననున్నారు. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ
సమన్వయ కర్తలు హాజరుకానున్నారు.  ప్రత్యేక హోదా
ఉద్యమాన్ని  సజీవంగా ఉంచడంతోపాటు, హోదా
వల్ల కలిగే ప్రయోజనాలు, హోదా ఇవ్వకుండా నాలుగేళ్లుగా తెలుగుదేశం, బిజెపిలు
చేస్తున్న వంచనలపై ప్రజలకు దీక్షా వేదిక ద్వారా  మరింత అవగాహన కల్పించనున్నారు. 

Back to Top