వంచన దీక్షను విజయవంతం చేద్దాం

హైదరాబాద్‌:

ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టం అంశాల విషయంలో చేసిన మోసానికి నిరసనగా విశాఖపట్నం వేదికగా చేపట్టబోయే నయవంచన దీక్షను విజయవంతం చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సూచించింది. ఈ మేరకు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టే వంచన దీక్షలో పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, పార్టమెంట్‌ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలకు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు దీక్షలో పాల్గొనాలని సూచించింది. విశాఖపట్నం వేదికగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటలు 12 గంటల పాటు నిరసనకు నిదర్శనంగా నలుపు చొక్కా లేదా టీషర్ట్‌ ధరించి నిరాహార దీక్షలో పాల్గొనాలని పార్టీ అధిష్టానం కోరింది. నాయకులందరూ 29వ తేదీ సాయంత్రం వరకు విశాఖపట్నం చేరుకొని 30వ తేదీన ఉదయం 7 గంటలకల్లా జీవీఎంసీ కార్యాలయం సమీపంలోని మహిళా కళాశాల ఎదురుగా గల దీక్షాస్థలికి చేరుకొని నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసింది.

Back to Top