వంగవీటి రాధా, రంగాలకు షర్మిల నివాళి

ఉయ్యూరు (కృష్ణా జిల్లా), 31 మార్చి 2013: వంగవీటి రాధా, రంగా విగ్రహాలకు శ్రీమతి షర్మిల ఆదివారంనాడు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ‌అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కృష్ణా జిల్లాలోని వంతాడ గ్రామం చేరుకున్నారు. శ్రీమతి షర్మిలకు వైయస్ అభిమానులు,‌ పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో వంగవీటి రంగా విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. మంటాడలో వంగవీటి రాధా విగ్రహానికి కూడా శ్రీమతి షర్మిల పూలమాల వేసి నివాళులు అర్పించారు.
Back to Top