వైయ‌స్ఆర్‌సీపీలోకి జీవీఎంసీ కీల‌క నేత

 
విశాఖసిటీ: జ‌ల్లాలో వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు, ఆయ‌న ప్ర‌జ‌ల కోసం చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప‌లువురు ఆక‌ర్శితుల‌వుతున్నారు. తాజాగా విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ సెక్రటరీ జనరల్‌ వి.వి.వామనరావు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. యూ నియన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటికొప్పాకలో జరగనున్న ప్రజాసంకల్ప యాత్రలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పలువురు కార్మిక నాయకులతో కలిసి పార్టీలో చేరుతున్నానని వెల్లడించారు. పలు సందర్భాల్లో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండానే కార్మి క సంఘం గుర్తింపు ఎన్నికల్లో స్వతంత్రంగానే విజయాన్నివసం చేసుకున్నానని తెలిపారు. 1984లో కార్మిక సంఘమైన బీఎంఎస్‌లో కార్మిక నేతగా తన ప్రస్థానం మొదలైందనీ, ఆ తర్వాత 1987లో టీడీపీ అనుబంధ కార్మిక సంఘ విభేదాలు కారణంగా తటస్థంగా ఉన్నానని వివరించారు.

అప్పటి నుంచి జీవీఎంసీ కార్మిక సంఘం ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగానే పోటీ చేసి మూడుసార్లు గుర్తింపు యూనియన్‌గా విజయం సాధించడం వెనుక కార్మికుల మద్దతు ఉందన్నారు. కార్మిక నేతగా తాను చేసిన సేవలకు  కేవలం 36 ఏళ్ల వయసులోనే శ్రమశక్తి అవార్డు దక్కిందనీ వివరించింది. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించడంతో ఆపార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు వామనరావు తెలిపారు. ముఖ్యంగా కార్మికుల 010 పద్దు, సీపీఎఫ్‌ విధానం అమలు కనీస వేతన అమలు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల్ని రెగ్యులర్‌ చేసే అంశాలపై జగన్‌మోహన్‌రెడ్డి తమకు స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్పారు. తమ కార్మికుల అభీష్టం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకే జీవీఎంసీలో తన ఉద్యోగానికి వాలంటరీ రిటైర్‌మెంట్‌ ఇచ్చానని తెలిపారు. వైఎస్సార్‌సీపీ కార్మిక నేతగా, జీవీ ఎంసీ యూనియన్‌ ప్రతినిధిగా ఉంటూ.. రాబో యే కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో మహా నగర పాలక సంస్థలో పార్టీ జెండా రెపరెపలాడిస్తానని ధీమా వ్యక్తం చేశారు. 

Back to Top