విలువైన భూములు కబ్జా

హైదరాబాద్ః చంద్రబాబు ప్రభుత్వం విశాఖకు ఇచ్చిన హామీలన్నీ విస్మరించిందని  వైయస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖకు రైల్వే జోన్ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ఇక విశాఖలోని విలువైన 18 ఎకరాల దసపల్లా భూములపై  లోకేష్ బినామీలు కన్నేశారని మండిపడ్డారు. అవినీతి ముఖ్యమంత్రి, ఆయన తనయుడు లోకేష్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని విలువైన భూములను తన బినామీల పేర రాయించుకుంటున్నారని ఆగ్రహించారు. దీన్ని వైయస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు.

Back to Top