వైయస్ విజయమ్మకు తీవ్ర అస్వస్థత

హైదరాబాద్, 6 ఏప్రిల్‌ 2013: రాష్ట్ర ప్రజలపై పెను ఆర్థిక భారం మోపుతూ కరెంట్ ఛార్జీల‌ను పెంచడం, విద్యుత్ కోత‌లు విధించడాన్ని నిరసిస్తూ ఐదు రోజుల నుంచి నిరవధిక నిరాహార దీక్ష (కరెంట్‌ సత్యాగ్రహం) చేస్తున్న వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరో‌ వైపున అదే దీక్షా శిబిరంలో దీక్ష చేస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, బి. గుర్నాథరెడ్డి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. చక్కెర స్థాయిలో పడిపోవటంతో భూమా శోభా నాగిరెడ్డి, సుజయకృష్ణ రంగారావు కుప్పకూలారు. గొట్టిపాటి రవికుమార్, జోగి రమే‌ష్, బాలినేని శ్రీనివాసరెడ్డి, అమర్నాథరెడ్డిలకు ‌బిపి స్థాయి పూర్తిగా పడిపోయింది. హైదరాబాద్‌ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సు ప్రాంగణంలో వీరంతా దీక్ష చేస్తున్నారు.
Back to Top