'వైయస్ విజయమ్మకు ఘన స్వాగతం'


హైదరాబాద్, 4 జనవరి 2013: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మకు శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. మాదాపూర్, కొండాపూర్, చందానగర్‌లలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు శ్రీమతి వైయస్ విజయమ్మ రాక కోసం రోడ్లకు ఇరువైపులా బారులు తీరారు. పటాన్ చెరులోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు వెళుతున్న శ్రీమతి వైయస్ విజయమ్మను చూసేందుకు జనం పోటీ పడ్డారు.

మహానేతకు నివాళి
      కొండాపూర్‌లో ఏర్పాటు చేసిన వేదికపై దివంగత మహానేత డాక్టర్ వైయస్ .రాజశేఖర్‌రెడ్డి చిత్రపటం ఎదుట శ్రీమతి వైయస్ విజయమ్మ జ్యోతిని వెలిగించి  నివాళులర్పించారు. అనంతరం పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బొమ్మతో ఒంగూరు శ్రీనివాస్‌యాదవ్ రూపొందించిన 2013వ సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. చందానగర్ కూడలిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి ఆవిష్కరించారు.  అనంతరం వేదిక వద్ద రోడ్డుకు ఇరువైపులా వేలాదిగా వేచి ఉన్న ప్రజలు, పార్టీ కార్యకర్తలకు శ్రీమతి వైయస్ విజయమ్మ అభివాదం చేస్తూ లింగంపల్లి వైపు సాగిపోయారు.

Back to Top