వైయస్ కుటుంబంపై కక్షసాధింపు

మందమర్రి:

రాష్ట్రంలో డీలాపడిన కాంగ్రెస్‌ను బతికించింది దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డేనని  వైయస్ఆర్ కాంగ్రెస్ జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ కాంపల్లి సమ్మయ్య, పట్టణ అధ్యక్షుడు పుల్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. మందమర్రిలోని అంగడీబజార్ రైల్వే గేట్ ప్రాంతంలో నిర్వహించిన 'జగన్ కోసం జనం సంతకం' కార్యక్రమంలో వారు మాట్లాడారు. మహానేత మరణానంతరం ఆయన కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి.. కాంగ్రెస్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టి ప్రజాభిమానానికి  దూరం చేయాలని కంకణం కట్టుకున్నారన్నారు. ప్రభుత్వ కుట్రలు ఛేదించి శ్రీ జగన్మోహన్ రెడ్డి బయటకొస్తారనీ.. ఆయన ముఖ్యమంత్రి రావడం ఖాయమనీ వారు స్పష్టం చేశారు. మందమర్రిలో నిర్వహిస్తున్న 'జగన్ కోసం జనం సంతకం' కార్యక్రమాన్ని వేగిర పరచాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సూచించినట్లు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తోట సత్యనారాయణ తెలిపారు.

Back to Top