వైయస్, జగ్జీవ‌న్ విగ్రహాలు ఆవిష్కరించిన షర్మిల

రాయగూడెం (ఖమ్మం జిల్లా), 23 ఏప్రిల్‌ 2013: శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఖమ్మం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల మంగళవారం నాడు పాలేరు నియోజకవర్గంలోని రాయగూడెంలో మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి, బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాలను ఆవిష్కరించారు. ‌ఈ కార్యక్రమాలకు వేలాది మంది వైయస్ అభిమానులు, వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కార్యక్తరలు తరలివచ్చారు.‌ అనంతరం శ్రీమతి షర్మిలను చెరకు రైతులు కలుసుకుని తమ కష్టాలు చెప్పుకున్నారు. విద్యుత్ సరఫరా అసలు ఉండటంలేదని‌, పైరు ఎండిపోయిందని వారు తమ ఇబ్బందులను శ్రీమతి షర్మిల ముందు ఏకరువు పెట్టారు. జగనన్న రాజ్యం త్వరలోనే వస్తుందని, ధైర్యంగా ఉండాలని వారికి శ్రీమతి షర్మిల సూచించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top