వైయస్‌ హామీల అమలు కోసం ఆళ్ళ నాని ధర్నా

ఏలూరు‌, 22 ఏప్రిల్‌ 2013: మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని సోమవారం‌ స్థానిక ఇరిగేషన్ ఎస్సీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రూ.25 కోట్లతో తమ్మిలేరుకు రక్షణ గోడ ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తమ్మిలేరుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి 17 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఓ వైపు రక్షణ గోడ నిర్మించారు‌. అంతేకాక రెండవ వైపు గోడకు రూ. 28 కోట్లు కూడా ఆ మహానేత మంజూరు చేశారు. అయితే ఇప్పటివరకూ రెండవ వైపు గోడ నిర్మించకపోవటంతో వర్షాలు వచ్చినప్పుడల్లా ఏలూరు వాసులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాని ఆవేదన వ్యక్తంచేశారు.
Back to Top