వైయస్‌ఆర్‌ టియుసి దేశ వ్యాప్త సమ్మె పిలుపు

విశాఖపట్నం, 27 జనవరి 2013: వచ్చే ఫిబ్రవరి 21, 22 తేదీల్లో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొనాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బి. జనక్ ప్రసా‌ద్ పిలుపు ఇచ్చారు. నిత్యావసర వస్తువుల ధర‌లు ఆకాశాన్ని అంటడం, కార్మిక చట్టాలు అమలు కాకపోవడానికి నిరసనగా ఆ రెండు రోజుల్లో సమ్మె చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కార్మిక సంఘాలన్నీ ఈ దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఆదివారంనాడు విశాఖపట్నంలో ఆయన విజ్ఞప్తి చేశారు.

వివాదాస్పద 26 జీఓలను విడుదల చేసిన రాష్ట్ర మంత్రులు స్వేచ్ఛగా బయటే తిరుగుతున్నారని, అయితే, ఆ జీఓలతో సంబంధమే లేని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, కడప లోక్‌సభ సభ్యుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని మాత్రం కాంగ్రెస్‌, టిడిపిలు కుమ్మక్కై జైలుకు పంపాయని జనక్‌ ప్రసాద్ ‌ఆవేదన వ్యక్తం చేశారు.
Back to Top