<strong>న్యూఢిల్లీ, 12 మార్చి 2013: </strong>చెరసాలలు, నిర్బంధాలతో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు జూపూడి ప్రభాకర్, మూలింటి మారెప్ప అన్నారు. అశేష ప్రజాబలంతో తమ పార్టీ ముందుకు దూసుకుపోతోందన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వారు వైయస్‌ఆర్‌సిపి ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పురిటిలోనే తమ పార్టీ గొంతు నులిమేయాలని కొందరు యత్నించారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామన్నారు.<br/>టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, సిఎం కిరణ్‌కు మధ్య రహస్య ఒప్పందం ఉందని, అవిశ్వాసానికి టిడిపి ముందుకు రావడంలేదని జూపూడి, మూలింటి ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంటే అవిశ్వాసాన్ని సమర్థించాలన్నారు. ఏ పార్టీతోనూ కలవాల్సిన అవసరం వైయస్‌ఆర్‌సిపికి లేదన్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఇంటర్వ్యూపై తప్పుడు భాష్యం చెబుతున్నారని వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.