వైయస్‌ఆర్‌సిపిలో సంగిత వెంకటరెడ్డి చేరిక

హైదరాబాద్, 26 జనవరి 2013: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి సంగిత వెంకటరెడ్డి‌ శనివారంనాడు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు.‌ హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, మైసూరారెడ్డి‌ల సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు నియోజకవర్గానికి చెందిన వెంకటరెడ్డి నలుగురు ముఖ్యమంత్రుల కేబినెట్లలో మంత్రిగా పదవులు నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె. డేవిడ్ రాజు తదితరులు కూడా శనివారంనాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డికి తూర్పుగోదావరి జిల్లా నుంచి సంగిత అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. మండపేట, కొత్తపేట నియోజకవర్గాలలో సంగిత తనదైన ముద్ర వేశారు. ప్రజా సమస్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి స్పందిస్తున్న తీరు తనను ఆకర్షించిందని ఆయన చెప్పారు. శ్రీ జగన్ పట్ల కాంగ్రె‌స్ ప్రభుత్వం అవలంబిస్తున్న కక్షపూరిత వైఖరికి నిరసనగా, మహానేత వైయస్ కుటుంబానికి అండగా ఉండాలనే తాను వైయస్ఆర్ కాంగ్రె‌స్‌లో చేరినట్టు తెలిపారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. మహానేత డాక్టర్ వై‌యస్ ఆశయాలను నెరవేర్చే ‌నాయకుడు శ్రీ జగన్ ఒక్కరే‌ అన్నారు. పార్టీ బలోపేతానికి తాను శక్తివంచన లేకుండా పాటుపడతానన్నారు.


Back to Top