వైయస్‌ఆర్‌సిపిలో చేరిన ఎస్ఎ‌ఫ్ఐ నాయకులు

నెల్లూరు : జిల్లాలోని పొదలకూరు మండలంలో ఉన్న పలు కళాశాలల్లోని వందలాది మంది ఎస్‌ఎ‌ఫ్‌, నాయకులు కార్యకర్తలు శుక్రవారంనాడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. నెల్లూరు జిల్లా వైయస్‌ఆర్‌సిపి కన్వీనర్ కాకాణి గోవర్ధ‌న్‌రెడ్డి సమక్షంలో, పార్టీ నాయకులు మద్దిరెడ్డి రమణారెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో  వారంతా పార్టీలో చేరారు.

ఎస్ఎ‌ఫ్ఐ‌ పొదలకూరు మండల అధ్యక్షుడు చిన్నయ్య, కార్యదర్శి ఎస్‌.కె. రహంతుల్లా, అదనపు కార్యదర్శులు సిహెచ్ పండు, వెంకటేశ్వర్లు, సభ్యులు సునీ‌ల్, వెంకటేశ్వర్లు, ‌కె. రవి, ఎస్‌.కె. సలీం, గణేష్‌, పలువురు కార్యకర్తలు వైయస్‌ఆర్‌సిపిలో చేరారు.

ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ‌.. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మహానేత డాక్టర్ వైయస్‌‌ రాజశేఖరరెడ్డి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. మహానేత మృతితో ఆయన ప్రవేశ పెట్టిన పథకాలను సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే వై‌యస్‌ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అమలు జరుగుతాయన్నారు.
Back to Top