వైయస్‌ఆర్‌సిపిలో చేరిన డాక్టర్‌ విజయ్‌కుమార్

హైదరాబాద్, 17 జనవరి 2013: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పట్ల రోజు రోజుకూ ఆదరణ పెరుగుతూనే ఉంది. మహబూబ్‌నగ‌ర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి నర్సప్ప కుమారుడు డాక్టర్ విజ‌య్‌కుమార్ గురువారం‌నాడు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీలో చేరారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ నివాసంలో ఆమె సమక్షంలో విజ‌య్‌కుమార్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.‌

డాక్టర్ విజ‌య్‌కుమార్‌తో పాటు జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన పలువురు మాజీ సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, కాంగ్రెస్, ‌బిజెపి నాయకులు కూడా వైయస్‌ఆర్‌సిపి సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురు వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ, తమ నాయకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మన రాష్ట్రానికి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సేవలే తాము పార్టీలో చేరడానికి స్ఫూర్గిగా నిలిచాయన్నారు. మహానేత వైయస్‌ఆర్‌ స్ఫూర్తితో జడ్చర్ల నియోజకవర్గంలో తాము నిర్వహించిన ప్రజోపయోగ కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మకు వివరించామని విజయ్‌కుమార్‌ తెలిపారు.
Back to Top