వైయస్ఆర్ సీపీలో వంద మంది చేరిక

పెద్దతిప్పసముద్రం

: చిత్తూరు జిల్లా పెద్ద తిప్ప సముద్రం మండలంలోని మడుమూరు పంచాయతీ శ్రీనివాసరాయునిపల్లెలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన వంద మంది కార్యకర్తలు ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో  చేరారు. పార్టీలో చేరిన కార్యకర్తలను ఎమ్మెల్యే ఆప్యాయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు ప్రజా సమస్యలను విస్మరించారన్నారు. వచ్చేది శ్రీ జగన్మోహన్‌ రెడ్డి పాలనేననీ, అప్పుడు ప్రజలు సుభిక్షంగా ఉంటారని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో క్ష వైయస్  జగన్మోహన్‌ రెడ్డి సీఎం కావడం ఖాయమని ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికలలో ప్రజలే అధికార, ప్రతిపక్ష పార్టీలకు బుద్ధిచెబుతారన్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పాల్సిన ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీతో కుమ్మక్కై శ్రీ జగన్మోహన్ రెడ్డిని జైలు పాల్జేశారని ఆవేదన వ్యక్తంచేశారు.

Back to Top