వైయస్ఆర్ సీపీలోకి తెలుగు యువత నేత

క్రోసూరు:

తెలుగుదేశం పార్టీలో 25 ఏళ్లుగా క్రియాశీలక కార్యకర్తగా పనిచేసిన తాను ఆ పార్టీ ఒంటెత్తు పోకడలకు నిరసనగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్ర తెలుగు యువత మాజీ కార్యదర్శిగా కంచేటి సాయికుమార్ ప్రకటించారు. గుంటూరు జిల్లా క్రోసూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను మూడు సార్లు టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రెండుసార్లు రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శిగా పనిచేసినట్లు తెలిపారు. ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న తనపై మంత్రి కన్నాలక్ష్మీనారాయణ 30 సార్లు కేసులు బనాయించారని, పార్టీ కోసం  అహర్నిశలూ పనిచేస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తనను అణదొక్కాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పార్టీలో వేధింపులు భరించలేక తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ అమలుచేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినైన తాను ఆయన తనయుడు శ్రీ వైయస్  జగన్మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని వైయస్ఆర్ సీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. శ్రీమతి షర్మిల సమక్షంలో తాను బెల్లంకొండలో పార్టీలో చేరతానన్నారు. ఆయనతోపాటు టీడీపీ నాయకులు, పీసపాడు మాజీ సర్పంచి కంచేటి కాశీవిశ్వేశ్వరరావు, తెలుగు యువత మాజీ కార్యవర్గ సభ్యులు పిల్లకత్తుల రామయ్య, సొసైటీ మాజీ డైరక్టర్ కుంభాకొండలు, నాయకులు దూళ్ల సాంబయ్య, షేక్ ఖాజాతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ ముస్తఫా, తాళ్లూరు కొండలు రాజీనామా చేసినవారిలో ఉన్నారు.

తాజా వీడియోలు

Back to Top