వైయస్ఆర్ సీపీలోకి పెరుగుతున్న చేరికలు

హైదరాబాద్, 25 డిసెంబర్ 2012:

రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేసిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి.  అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మహానేత ప్రవేశ పెట్టిన పలు సంక్షేమ పథకాల అమలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి వల్లే సాధ్యమవుతుందని, అందుకే పార్టీలో చేరుతున్నట్టు పలువురు నేతలు చెపుతున్నారు. శ్రీ జగన్మోహనరెడ్డి ఓదార్పుయాత్ర పేరుతో ప్రజల మధ్య తిరుగుతూ, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారని, జనాదరణ చూరగొన్ననేత శ్రీ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అంటున్నారు.

     చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని జంగాలపల్లిలో కాంగ్రెస్, టీడీలకు చెందిన 500 మంది నేతలు, కార్యకర్తలు  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జంగాలపల్లెలో సోమవారంనాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, నియోజకవర్గ ఇన్‌చార్జి బియ్యపు మధుసూదనరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యూ రు. వారి సమక్షంలో గ్రావుంలోని కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

     విశాఖపట్నం జిల్లా గోపాలపురంలో ప్రవాసాంధ్రులు సైతం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక కూసం రామ్మోహన్‌రెడ్డి నివాసం వద్ద సోమవారం ప్రవాసాంధ్రులు, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వందలాది మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. పార్టీ నేత బాలరాజు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక పార్టీ నేతలు దాసరి మున్నా, దొడ్డిగర్ల సువర్ణరాజు ప్రోత్సాహంతో ప్రవాసాంధ్రులు డాక్టర్ దాకే జాన్ దేవదాస్ (సింగపూర్), చిక్కాల ప్రాంక్లిన్ (కువైట్), కాటం మైకెల్ కిషోర్ (రష్యా) లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాలరాజు మట్లాడుతూ, ప్రవాసాంధ్రులు కూడా పార్టీని ఎంతగానో ఆదరిస్తున్నారని అన్నారు.

     నల్గొండ జిల్లా భువనగిరి మండలంలోని పెంచికల్, బండ సోమారం గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వివిధ పార్టీలకు చెందిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలు సోమవారంనాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోన్న కాంగ్రెస్, టీడీపీలకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలనే ఉద్దేశ్యంతో తామంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరామని నేతలు అన్నారు.

     రంగారెడ్డి జిల్లా షాపూర్‌నగర్ హెచ్‌ఎంటీ కల్యాణ మండపంలో జరిగిన ఒక కార్యక్రమంలో సుమారు 500 మంది యువకులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ జిల్లా కన్వీనర్ బి.జనార్దన్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీల్డ్ కవర్ సీఎం పదవి వద్దన్నందుకే వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. అంతకు ముందు షాపూర్‌నగర్ చౌరస్తాలో ఉన్న దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

తాజా వీడియోలు

Back to Top