వైయస్ఆర్‌ సీపీలో చేరిన మాజీ మండలాధ్యక్షుడు

నందివాడ:

కృష్ణా జిల్లా నందివాడ మండలంలోని తమిరిశ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ పర్వతనేని రాజేంద్రప్రసాద్  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ సీఈసీ సభ్యుడు, జెడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంటేశ్వరరావు(నాని) ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. కాం గ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నందివాడ మండలంలో ఆ పార్టీ నాయకులు ఇప్పటికే పలువురు పార్టీలో చేరారనీ, త్వరలోనే మరికొంత మంది చేరనున్నారనీ వివరించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేం పథకాల వల్ల ఎందరికో లబ్ధిచేకూరిందనీ, ఆయనపై తనకు ఉన్న అభిమానంతోనే పార్టీలో చేరాననీ పర్వతనేని రాజేంద్రప్రసాద్ తెలిపారు. గ్రామానికి చెందిన సజ్జా శివరామకృష్ణ, జుఝల రాఘవ, సన్నాల గిరిరావు, కర్రేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఉల్లస రామారావు కూడా పార్టీలో చేరారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు, మండల కన్వీనర్ పెయ్యల ఆదాం, పట్టణ యూత్ కన్వీనర్ లోయ రాజేష్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తెనాలి సుబ్బారావు పాల్గొన్నారు.

Back to Top