వైయస్ఆర్ సీపీ గడపలో తెలుగు తమ్ముళ్ళు

ఆదోని: ఆదోనికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వారి అనుచర గణంతో మంగళవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ జీఎన్ గోపాల్, డివిజన్ నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు, మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
సాయిప్రసాద్ రెడ్డి, పార్టీ బీసీ విభాగం జిల్లా కన్వీనర్ డా. మధుసూదన్, జిల్లా పార్టీ సభ్యుడు ప్రసాద్‌రావు , పట్టణ కమిటీ అధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి వారందరికీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు పార్టీలో చేరిన వారంతా స్థానిక మంగళాంజనేయ స్వామి కల్యాణ మంటపం నుంచి ఊరేగింపుగా వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా జీఎన్ గోపాల్ మాట్లాడుతూ వైయస్ఆర్ విధానాలు ఎంతగా నచ్చినా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో ఇంతకాలం ఆ పార్టీలోనే కొనసాగినట్లు చెప్పారు. వైయస్ఆర్ ఆశయాల సాధనకు కృషి చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారన్నారు.  సంఘం జిల్లా కోశాధికారి వెంకటస్వామి మాట్లాడుతూ ఎన్నికల ముందు మంగళాంజనేయ స్వామి కల్యాణమంటపం అభివృద్ధికి రూ. 5 లక్షల విరాళం ఇస్తానని చెప్పిన సాయి ప్రసాద్‌రెడ్డి ఓడిపోయినప్పటికీ ఎస్వీ మోహన్‌రెడ్డి ద్వారా ఎమ్మెల్సీ నిధులు మంజూరు చేయించారన్నారు. ఈరన్న, గురుస్వామి, రంగస్వామి, మల్లికార్జున, సుధాకర్ గోవిందరాజులు, రామకృష్ణ, మెకానిక్ ఈరన్న, సత్యమ్మ తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరినవారిలో ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కమిటీ సభ్యుడు ముని, నాయకులు సునార్ అబ్దుల్‌ఖాదర్, నగరూరు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ను.. గడప గడపకు తీసుకెళ్లాలి
ఖమ్మం అర్బన్: ప్రజల ఆకాంక్షలకు ని లువెత్తు రూపంగా వైయస్ఆర్ నిలిచారని, ఆయన ఆశయాల సాధనకు ఏర్పాటైన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని గడప గడపకూ తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని పార్టీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మంలో మంగళవారం పార్టీ మండల కన్వీనర్ల సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. పార్టీ లక్ష్యాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని, క్రియాశీలక సభ్యత్వ నమో దు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కోరారు. 18 రకాల ప్రజాసంఘాలను నిర్మించాలని చెప్పా రు. ప్రధానంగా రైతు, యువజన, శ్రామికులను ఆయా సంఘాల్లోకి సమీకరించాలని కోరారు. పల్లెల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు.
పార్టీని పటిష్టంగా నిర్మించేందుకు నా యకులు, కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. వైయస్‌ఆర్ లక్ష్యాలను సాధించగలిగిన సత్తా జగన్మోహన్ రెడ్డికే ఉందని, అందుకే ఆయన నాయకత్వాన్ని ప్రజలు ఆహ్వానిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొబ్బిలి భరత్‌చంద్ర, యువజన వి భాగం జిల్లా కన్వీనర్ రామసహాయం నరేష్‌రెడ్డి, సేవాదళ్ జిల్లా కన్వీనర్ రాంప్రసాద్, విద్యార్థి వి భాగం జిల్లా కన్వీనర్ అయిలూరి మహేష్‌రెడ్డి, మ హిళా విభాగం జిల్లా కన్వీనర్ బానోత్ పద్మావతి, రైతు విభాగం జిల్లా కన్వీనర్ మందడపు వెంకటేశ్వరరావు, ఎస్సీ సెల్ విభాగం జిల్లా కన్వీనర్ మెం డెం జయరాజు, ఎస్టీ విభాగం జిల్లా కన్వీనర్ భూ క్యా దళ్‌సింగ్ నాయక్, బీసీ విభాగం జిల్లా కన్వీనర్ తోట రామారావు, ఉపాధ్యాయ విభాగం జి ల్లా కన్వీనర్ దేశరెడ్డి ప్రతాప్‌రెడ్డి, సాంస్కృతిక వి భాగం జిల్లా కన్వీనర్ కాంపెల్లి బాలకృష్ణ, న్యాయ విభాగం జిల్లా కన్వీనర్‌ జె. పాపారావు తదితరులు పాల్గొన్నారు.
38 కుటుంబాల చేరిక
పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం జుజుల్‌రావుపేట గ్రామానికి చెందిన 38 కుటుం బాల వారు మంగళవారం కంచర్ల జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. వీరిని జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్, యువజన వి భాగం జిల్లా కన్వీనర్ రాంసహాయం నరేష్‌రెడ్డి సా దరంగా ఆహ్వానించారు. చేరిన వారిలో ఎల్.దీప్తకుమార్, ఎస్‌కె.హుస్సేన్, వి.తిరుపతి నాయక్, డి.రవి, వి.ప్రసాద్, జె.బన్సీలాల్, ఎన్.మోహన్, నందగోపాల్, సిహెచ్.వెంకన్న, బి.వెంకటేశ్వరరావు, రమేష్, కె.శివ, వై.వంశీ, సిహెచ్.చంటి, కె.క్రాంతికుమార్, ఎం.వెంకటేశ్వర్లు, బి.నరేష్, ఆర్.ఎల్లేశ్వరరావు, జి.నరేష్ తదితరులు ఉన్నారు. 

Back to Top