వైయస్ఆర్ మాలధారణ

పథకాల సృష్టికర్తవే... వైఎస్సార్!!
అనంతపురం:  
ఓం స్వామియే... శరణం వైఎస్సార్...! పథకాల సృష్టికర్తవే... శరణం వైఎస్సార్...!! అపరభగీరథుడవే... శరణం వైఎస్సార్...!!! ఆరోగ్యశ్రీ ప్రదాతవే ... వైఎస్సార్...!!!! అంటూ మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిమానులు పలువురు మాల ధరించారు. వైఎస్ అభిమాన సంఘం, వైఎస్సార్‌సీపీ జిల్లా నేత ఎల్‌ఎం మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి ఆధ్వర్యం వహించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ ఆవరణలో ఉన్న వైఎస్ విగ్రహం ఎదుట ప్రత్యేక పూజలు చేసిన 25 మంది అభిమానులు సంప్రదాయబద్ధంగా ఇరుముడి కట్టించుకున్నారు.

 రామ్మోహన్, వన్నూరప్ప, లోకేష్, రామ్మూర్తి, కిష్టప్ప, ప్రభాకర్, నాగభూషణ, దేవధర్, రామాంజి, శివ, మాతయ్య, నాగేంద్ర, విశాల్, నారాయణ, గోవిందు, ఫక్కీరప్ప, రామన్న, లాజరప్ప, గంగాధర్, హనుమంతరాయుడు, సూరి, అమర్, భాస్కర్, రాజునప్ప సూరి తదితరులు ఇరుముడి నెత్తిన పెట్టుకుని ఇడుపులపాయకు పాదయాత్రగా బయల్దేరారు. ఎల్‌ఎం మాట్లాడుతూ మానవరూపంలో ఉన్న దేవుడే మహానేత వైఎస్సార్ అని అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం చివరి నిమిషం వరకు శ్రమించారని కీర్తించారు. వైఎస్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకుని పూజలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ మాలధారులు బత్తలపల్లి, పార్నపల్లి, వేముల ప్రాంతాల మీదుగా సెప్టెంబర్ రెండో తేదీకి ఇడుపులపాయకు చేరుకుని మహానేత సమాధి వద్ద నివాళులర్పిస్తారని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఎన్‌సీ బాలనరసింహారెడ్డి, కోనా రాజారెడ్డి, పసుపుల బాలకృష్ణారెడ్డి, దాదాఖలందర్, గోవిందు, కునుకుంట్ల రంగారెడ్డి, అమర, భాస్కర్‌రెడ్డి, బి.కేశవరెడ్డి, సుబ్బ య్య, శ్రీనివాసులు, హరి, మంజులమ్మ, మహదేవమ్మ, వనజాక్షి, అనిల్, కుళ్లాయప్ప, నారాయణ, అక్కులప్ప తదితరులు పాల్గొన్నారు.       

Back to Top