వైయస్ఆర్ కృషితోనే హంద్రీ నీవా

అనంతపురం, 28 నవంబర్ 2012:

హంద్రీ నీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను రాయలసీమ వాసులకు అందించిన ఘనత దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, గురునాథరెడ్డి అన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్టు కోసం వైయస్ రాజశేఖరరెడ్డి అపర భగీరధుడిలా పోరాడారని వారు కొనియాడారు. కానీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,  కాంగ్రెస్ పార్టీ నేతలు ఏరోజు వైయస్ఆర్ ప్రస్తావన తేలేదని ఎద్దేవా చేశారు.
 
     మహానేత సేవలను గుర్తు చేసుకుంటూ అనంతపురం ప్రజలు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం పట్టణంలోని వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి కృష్ణా జలాలతో అభిషేకం చేశారు. ఈ సంద్భంగా ఎమ్మెల్యేలు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.  వైయస్ రాజశేఖరరెడ్డి పేరును తలచకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు కుట్ర పన్నారని కాపు రామచంద్రారెడ్డి అన్నారు. హంద్రీ నీవా తమ కృషేనని చెప్పుకోవటానికి మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలు నానా తంటాలు పడుతున్నారని ఎమ్మెల్యే గురునాథ రెడ్డి విమర్శించారు.

Back to Top