వైయస్ఆర్ కాంగ్రెస్ వరంగల్ కన్వీనర్‌ నియామకం

వరంగల్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ నగర కన్వీనర్‌గా మార్కె ట్ కమిటీ మాజీ చైర్మన్ తుమికి రమేష్‌బాబు  నియమితులయ్యారు.  కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందిన రమేష్‌బాబు ఇటీవలే  వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈయన యువజన కాంగ్రెస్ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నగరంలో పార్టీని  బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని రమేష్‌బాబు చెప్పారు.

Back to Top