వైయస్ఆర్ కాంగ్రెస్‏తోనే సంక్షేమం సాధ్యం

తిరుపాడు:

వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తాయని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. గడపగడపకూ వైయస్‌ఆర్‌ సీపీ కార్యక్రమంలో భాగంగా తిరుపాడు, పైబోగుల, ఉండుట్ల గ్రామాల్లో మండల కన్వీనర్ వై.శివరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు పరచడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. బోర్లు, బావుల్లో నీరు పుష్కలంగా ఉన్నా రైతుల పొలాలకు నీరు పెట్టుకునే వీల్లేకుండా కరెంట్ కోతలు విధిస్తున్నారన్నారు.

Back to Top