వైయస్ఆర్ కాంగ్రెస్ రెండురోజుల దీక్ష

హైదరాబాద్:

రాష్ట్రంలోని పత్తి రైతుకు తమ పార్టీ బాసటగా నిలుస్తుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం కన్వీనర్ నాగిరెడ్డి ప్రకటించారు. పత్తి రైతులకు కనీస మద్దతు ధర కూడా దక్కని పరిస్థితిల్లో రాష్ట్ర ప్రభుత్వం తనకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. పత్తి రైతుకు మద్దతుగా మహబూబ్‌నగర్ జిల్లాలో  48 గంటల పాటు నిరసన దీక్ష తలపెట్టినట్టు చెప్పారు. బుధవారం దీక్ష ప్రారంభమవుతుందన్నారు. పత్తి కనీస మద్దతు ధర రూ.3900లకు అదనంగా మరో రూ.1500 చెల్లించాలనీ, రంగు మారిన పత్తిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో  రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని నాగిరెడ్డ హెచ్చరించారు.

Back to Top