వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్న పాదూరి

భువనగిరి:

నల్గొండ జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. నల్గొండ జిల్లాకు చెందిన పాదూరి కరుణ ఈ నెల తొమ్మిదిన పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో ఆమె పార్టీలో చేరనున్నారు. అలాగే మైనారిటీ నేత సలీం కూడా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెలలో భువగిరిలో నిర్వహించిన పార్టీ సభ విజయవంతం కావడంతో ఇతర పార్టీల నాయకులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు. ఆ జిల్లాకు చెందిన తెలంగాణ యువ ఐకాస నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి పార్టీలో చేరిన విషం తెలిసిందే.

Back to Top