వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతా: గొట్టిపాటి

గుంటూరు:

అద్దంకి నియోజకవర్గంలోని ప్రజల అభీష్టం మేరకే తాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు.  బుధవారం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో విలేకరులతో మాట్లాడారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డితో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన మేరకు తాను ఎప్పుడు చేరేది అనే విషయమై స్పష్టత వస్తుందన్నారు. డాక్టర్ వైయస్ఆర్ ప్రారంభించిన సంక్షేమ పథకాల అమలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. తనకు ఎమ్మెల్యే సీటును కేటాయించిన డాక్టర్ వైయస్ఆర్ కుటుంబానికి విధేయుడనై ఉంటానని రవికుమార్ ప్రకటించారు.

Back to Top