వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక

కాట్రేనికోన:

పేదల సమస్యలను గాలికొదిలేసిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని వైయస్ఆర్ కాంగ్రెస్  జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గుత్తుల సాయి అన్నారు. పార్టీ మండల కన్వీనర్ విత్తనాల వెంకటరమణ అధ్యక్షతన స్థానిక రామస్వామి తోటలో ఏర్పాటూన సమావేశంలో మాజీ మంత్రి మోకా విష్ణుప్రసాదరావు సతీమణి చంద్ర నాగరత్నంతో పాటు వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీలో చేరారు. వీరికి ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. తొలుత పార్టీ నాయకుడు ఆనందరావు మాస్టారు వైయస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గుత్తుల సాయి మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు రాష్ర్ట ప్రభుత్వం కోత పెట్టిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నుంచిఆరోగ్యశ్రీ వరకు అన్నింటా నిబంధనల పేరిట కోత పెడుతోందని విమర్శించారు. మోకా చంద్ర నాగరత్నం మాట్లాడుతూ తప్పు చేయకుండానే వైయస్ జగన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పెమ్మాడి ప్రసాద్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పాలెపు లక్ష్మీ ధర్మారావు, నాయకులు వెంట్రు సుధీర్, మోకా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Back to Top