వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో వందలాది మంది చేరిక

హైదరాబాద్, 7 ఏప్రిల్‌ 2013: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఆదివారంనాడు వందలాది మంది అభిమానులు పార్టీలో చేరారు.

మెదక్ జిల్లా సిద్దిపేట ప్రె‌స్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కన్వీనర్ బట్టి జగపతి, శ్రావ‌ణ్‌కుమార్ ఆధ్వర్యంలో 200 మంది యువకులు, విద్యార్థులు పార్టీలో చేరారు. గుంటూరు మూ‌డవ డివిజన్ తూర్పు నియోజకవర్గ‌ం కన్వీనర్ సౌక‌త్ ఆధ్వర్యంలో ‌టిడిపి నుంచి 200 మంది కార్యకర్తలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారు. మహబూబ్నగ‌ర్ జిల్లా చల్లాపూ‌ర్ మండలం మల్లేశ్వరంలో పార్టీ కొల్లాపూ‌ర్ బాధ్యుడు హర్షవర్ధనరెడ్డి ఆధ్వర్యంలో 100 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. రంగారెడ్డి జిల్లా నవాబ్‌పేట్ మండలం హత్నాపూ‌ర్‌లో చేవెళ్ల నియోజకవర్గ పార్టీ బాధ్యుడు రాచమళ్ల సిద్ధేశ్వర్ ఆధ్వర్యంలో 100 మంది పార్టీలో చేరారు.

ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం నల్లబెల్లిలో వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు ఉప్పాడ ప్రసాద్‌రెడ్డి, మానే రామకృష్ణ ఆధ్వర్యంలో 50 కుటుంబాలవారు పార్టీలో చేరారు. ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం కట్టంవారిగూడెంలోని చిం‌తిర్యాలలో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చింతిర్యాల ఎస్సీకాలనీలో 95 కుటుంబాలు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించాయి.‌ మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్‌ రూపొందించి, అమలు చేసిన సంక్షేమ పథకాల కొనసాగింపు కేవలం శ్రీ వైయస్ జగ‌న్ నాయకత్వంలోని వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీతోనే సాధ్యమని‌ వారు ధీమా వ్యక్తంచేశారు.

తాజా ఫోటోలు

Back to Top