వైయస్‌ఆర్ కాంగ్రెస్‌లోకి వలస

కల్లూరు: వైయస్‌ఆర్ కాంగ్రెస్‌లోకి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున చేరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే, వైయస్‌ఆర్ సీపీ పాణ్యం నియోజకవర్గ ఇన్‌చార్జి గౌరు చరితారెడ్డి సమక్షంలో సోమవారం పాణ్యం మండలానికి చెందిన నాలుగు గ్రామాల ప్రజలు పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు. రాష్ట్ర ప్రజలు కరెంటు కోతలతో అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతోపాటు కరెంటు చార్జీలు, పెట్రో ధరలు, డీజిల్ ధరలు పెంచిందని, గ్యాస్ కోత విధించిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు జననేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు. 

వైయస్‌ఆర్‌ సీపీలో చేరిన భూపనపాడు టీడీపీ నాయకులు:
పాణ్యం మండల నాయకుడు మహేంద్రరెడ్డి ఆధ్వర్యంలో భూపనపాడుకు చెందిన టీడీపీ నాయకులు వైయస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో పుల్లయ్య, ఎల్లనాయుడు, వెంకటేశ్, సుబ్బయ్య, ఈశ్వరయ్య, మహానంది, వెంకటరమణ, రామచంద్రుడు, నారాయణ, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. ఎస్.కొత్తూరుకు చెందిన సుధాకర్‌రెడ్డి, వెంకటరెడ్డి, రాజు, వెంకటసుబ్బయ్య, నాగేశ్వరరెడ్డి, వెంకటేశ్వర్లు, సహదేవుడు, నాగరాజు తదితరులు పాణ్యం మండల నాయకుడు మహేంద్రరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వడ్డుగండ్ల గ్రామానికి చెందిన పెద్దశ్రీనివాసులు, మోహన్, ఎల్లశేషయ్య, వెంకటరమణ, తిరుపాలు, సోల్మన్, సుబ్బరాయుడు, కేశవులు తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పిన్నాపురానికి చెందిన పుల్లయ్య, ఎల్లనాయుడు, వెంకటేశ్, సుబ్బయ్య, ఈశ్వరయ్య, మహానంది, వెంకటరమణ, రామచంద్రుడు, నారాయణ, వెంకటరాముడు తదితరులు పార్టీలో చేరారు.

తాజా వీడియోలు

Back to Top