వైయస్ఆర్ కాంగ్రెస్‌లో ‘కంచేటి’

బెల్లంకొండ:

మాజీమంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు మేనల్లుడు, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి, పెదకూరపాడు నియోజకవర్గ నాయకుడు కంచేటి సాయిబాబు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బెల్లంకొండలో మరోప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, నియోజకవర్గ నాయకులు నూతలపాటి హనుమయ్య, గుత్తికొండ అంజిరెడ్డి, తదితరులు కంచేటి సాయిబాబును అభినందించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని సాయిబాబు ఈ సందర్భంగా షర్మిలకు తెలిపారు. ఆయనతో పాటు  సుమారు మూడు వేలమంది టీడీపీకి గుడ్‌బై చెప్పి షర్మిల సమక్షంలో పార్టీలో చేరారు.

Back to Top