వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో ఎన్‌ఆర్‌ఐ చందు

హైదరాబాద్:

కామన్వెల్తు బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా (సీబీఏ)లో ఐటీ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న గళ్లా చందు  వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో లాంఛనంగా చేరారు. పార్టీ సీనియర్ నాయకుడు వై.వి. సుబ్బారెడ్డి చందుకు పార్టీ కండువా కప్పి, సాదరంగా ఆహ్వానించారు. చందు వెంట వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే గుదిబండి వెంకటరెడ్డి, తెనాలి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు బొమ్ము నాగిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, సోమరౌతు రాము, గళ్లా శ్రీనివాస్, నక్కా శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మహానేత వైయస్‌ఆర్ కుటుంబాన్ని అమితంగా ఇష్టపడే చందు కొంతకాలంగా సిడ్నీలో పార్టీ కార్యక్రమాలకు సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. వైయస్‌ఆర్ జయంతి, వర్ధంతి సందర్భంగా సిడ్నీలో తెలుగు కుటుంబాలను ఒకచోట చేర్చి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చందు తదితరుల చేరికతో తెనాలి నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతమైనట్లయిందని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.

Back to Top