వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరిన టిడిపి నేత

హైదరాబాద్, 17 మే 2013: శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు గేదెల రామారావు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.  హైదరాబాద్ జూబ్లీ హిల్సు లోని లోటస్‌పాండ్‌లో ఉన్న పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి  విజయమ్మ నివాసంలో ఆయన పార్టీలో చేరారు. శ్రీమతి విజయమ్మ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. రామారావు శ్రీకాకుళం రూరల్ మండలానికి మాజీ అధ్యక్షుడు. రామారావుతోపాటు ఆయన తనయుడు పురుషోత్తం కూడా పార్టీలో చేరారు.

Back to Top