వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరిన డాక్టర్‌ మధుశేఖర్

హైదరాబాద్‌ : నిజామాబాద్ జిల్లాకు చెందిన డాక్ట‌ర్ మధుశేఖర్ ఆదివారం నాడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ‌ సభ్యత్వం తీసుకున్నారు. అంతకు ముందు ఆయన తెలంగాణ డాక్టర్ల జేఏసీ కో కన్వీనర్‌గా పనిచేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో ‌ఆయన పార్టీలో చేరారు. నిజామాబాద్ జిల్లా‌కే చెందిన పీసీసీ మాజీ కార్యదర్శి, నందిపేట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు నాయుడు ప్రకాశ్ తదితరులు‌ కూడా డాక్టర్ ‌మధుశేఖర్‌తో పాటు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Back to Top