వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరతున్నా: మాజీ ఎమ్మెల్సీ

ఏలూరు:

పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఇద్దరు ప్రముఖులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామ్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి కుమారి తాము పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల నాలుగో తేదీని కొవ్వూరులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న బహిరంగ సభలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరతామని వారు ప్రకటించారు.

Back to Top