<strong>హైదరాబాద్, 26 మార్చి 2013:</strong> శానససభ వద్ద వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం రాత్రి మెరుపు ధర్నాకు దిగారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా శాసనసభ సమావేశాలను అర్ధంతరంగా వాయిదా వేయడానికి నిరసనగా వారు ఈ ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ రెండవ నెంబర్ గేటు వద్ద వారు ఈ మెరుపు ధర్నా చేపట్టారు. విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదని పార్టీ ఎమ్మెల్యేలు విమర్శించారు.<br/>కాగా, ధర్నా చేస్తున్న ఎమ్మెల్యేలను అనుమతి లేదంటూ పోలీసులు అరెస్టు చేసి సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే, పోలీసు స్టేషన్ బయట కూడా ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. పోలీసులు విజ్ఞప్తి చేయడంతో కొద్దిసేపటి తరువాత వారు తమ ఆందోళనను విరమించుకున్నారు.