వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆకేపాటి చొరవ

రాజంపేట:

వైయస్ఆర్ కడప జిల్లా రాజంపేట శాసన సభ్యుడు ఆకేపాటి అమరనాథరెడ్డి చొరవతో  అన్నమయ్య ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీరు విడుదల చేసేందుకు కలెక్టర్ అనిల్‌కుమార్ అంగీకరించారు. దీనితో రైతాంగంలో హర్షం వ్య క్తమవుతోంది. మండలంలోని చెర్లోపల్లె, కారంపల్లె, బ్రాహ్మణపల్లె, కూచివారిపల్లె, మిట్టమీదపల్లెకు చెందిన రైతులు, ఆదర్శ రైతులు ఎమ్మెల్యేని కలిసి జలాశయంలో ని నీటిని కాల్వలకు విడుదల చేయించాలని ఇటీవల విన్నవించారు. ఆయన స్పందించి జిల్లా కలెక్టర్, నీటి పారుదలశాఖ అధికారులతో చర్చించారు. వారు 16న విడుదల చేస్తామని తెలిపారు.

Back to Top